ప్రకాశంజిల్లా చీరాలలో గత 4రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంసృతికశాఖ, కళాంజలి వారి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి. కళాకారులు పదర్శించిన నాటికలు నాటకాభిమానులను అలరించాయి. ప్రతి నాటికలోని ఇతివృత్తం అందర్నీ ఆలోచింపజేసిందని ప్రేక్షక్షులు ఆనందం వ్యక్తం చేశారు. ఉషోదయ కళానికేతన్ వారు ప్రదర్శించిన "బృందావనం" అనే నాటకం భారతీయ కుటుంబవ్యవస్దలోని వివాహం, దాంపత్య జీవిత ప్రాముఖ్యాన్ని చక్కగా చాటి చెప్పిందిని ఆహుతులు అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ నేపథ్యంలో హాస్యధోరణితో సాగిన అలీతో సరదాగా నాటికి ఆద్యంతం నవ్వులు పూయించింది.
ఇదీ చదవండి