ETV Bharat / state

మాస్క్‌, గ్లౌజ్‌లు లేకుండానే రోగులకు పరీక్షలా? - మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌ల ధరలు

దేశమంతా కరోనాపై యుద్ధం చేస్తోంది. ఇలాంటి తరుణంలో కీలక సేవలందిస్తున్న వైద్యులకు అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో ప్రత్యామ్నాయం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర కేసులు చూడాల్సి వస్తోందని అంటున్నారు వైద్యలు.

Doctors who test patients without masks and gloves prakasam
మాస్క్‌, గ్లౌజ్‌లు లేకుండానే రోగులను పరీక్షిస్తున్న వైద్యులు
author img

By

Published : Mar 30, 2020, 4:16 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరు ఆసుపత్రిలో మాస్క్‌, గ్లౌజ్‌లు లేకుండానే రోగులను పరీక్షిస్తున్న వైద్యులని చూసి రోగులు ఆందోళన పడుతున్నారు. పర్చూరు ఆసుపత్రికి నిండు గర్భిణి వచ్చింది. తొలి కాన్ఫు. అప్పటికప్పుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. ప్రసవం కష్టం కావటంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. శస్త్రచికిత్స సమయంలో అవసరమైన మాస్కులు, గ్లౌవ్‌లు లేకపోయాయి.

ఆసుపత్రిలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిదీ ఇదే పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో తగిన రక్షణ లేకుండానే ఈ తరహా సేవలు అందించడం ప్రమాదకరమైనా... మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో చేస్తున్నట్లు చెబుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులకు ప్రభుత్వమే వీటిని సరఫరా చేస్తుంది. కానీ, కొద్ది రోజులుగా సంబంధిత శాఖ ఈ విషయమై దృష్టి సారించలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు ఫణంగా పెట్టి రోగులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని కొందరు వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. అటు రోగులూ భయపడుతున్నారు. కొద్దిచోట్ల మినహా.. ఎక్కడా గ్లౌవ్‌లు, మాస్కులు లేకపోవడం గమనార్హం.

ఇదీ పరిస్థితి...

కరోనాపై సమరం చేస్తున్న తరుణంలో నిత్యం వైద్యులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని కేసులు చూడని పరిస్థితి ఉన్నందున... చాలా మంది ప్రభుత్వ వైద్యశాలలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్కారు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు తదితరాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.

సొంతంగా కొనుగోళ్లకూ ఇబ్బందే..

ప్రస్తుత పరిస్థితల్లో మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లౌజ్‌లు బాక్స్‌ ధర గతంలో రూ. 300- 400గా ఉండేది. ప్రస్తుతం రెట్టింపు అయింది. పెరిగిన ధరల ప్రకారం కొనుగోలు చేయాలన్నా మార్కెట్‌లో అందుబాటులో లేవు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి... ప్రభుత్వాసుపత్రులకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లను వెంటనే సరఫరా చేయాల్సిన అవసరం ఉందని వైద్యలు కోరుతున్నారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా...

అవసరమైన మాస్క్‌లు, గ్లౌవ్‌లు, శానిటైజర్ల సరఫరా మొదలైందని డీఎంహెచ్‌వో అప్పలనాయుడు తెలిపారు.

ఇదీ చూడండి:

సామాజిక దూరంపై.. పట్టింపు లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.