ప్రకాశం జిల్లా చీరాలలోని రెడ్ జోన్ ప్రాంతాలైన జయంతిపేట, జాన్ పేటల్లో వైకాపా చీరాల నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చీరాల వైసీపీ ఇంచార్జీ ఆమంచి అదేశాల మేరకు రెడ్ జోన్ ప్రాంతాల్లో జయంతిపేటలోని 200 కుటుంబాలకు 8రకాల కూరగాయాల కిట్లను పంపిణి చేశారు. చీరాల ప్రాంతంలో 23 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని వ్యవసాయ మార్కేట్ యార్ద్ చైర్మన్ మార్పు గ్రేగోరి పేర్కొన్నారు.
చీరాలలో లాక్ డౌన్ కొనసాగుతున్న నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆమంచి కృష్ణమోహన్ సూచనలు మేరకు మార్కేట్ యార్డ్ కమిటి ఆధ్వర్యంలో కుారగాయాలను పంపిణీ చేశామని తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించి, శానిట్తెజర్స్ ను వాడాలని గ్రెగోరి సూచించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ బుజ్జిబాబు, చుక్క శివ, కోటి దాసు, సత్యానంద్, ఆర్పీలు, వాలంటరీలు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇది చదవండి బిహార్‌కు తరలిస్తున్న వీవీప్యాడ్స్ యంత్రాలు