ETV Bharat / state

ఈవూరుపాలెంలో సేవలందిస్తున్న డిజిటల్ గ్రంథాలయం - ఈవూరుపాలెం గ్రంథాలయం తాజా వార్తలు

విశ్రాంత ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా నడుపుతున్న ఆ గ్రంథాలయం.. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగంగా మారింది. వారు మరో అడుగు ముందుకేసి సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగని ప్రకాశం జిల్లా ఈవూరుపాలెం విశ్రాంత ఉద్యోగులు.. పాఠాలు చెబుతూ యువతకు అండగా నిలుస్తున్నారు.

digital library at evurupalem
ఈవూరుపాలెంలో సేవలందిస్తున్న డిజిటల్ గ్రంథాలయం
author img

By

Published : Oct 29, 2020, 8:03 PM IST

ప్రస్తుతం గ్రంథాలయాల ప్రభావం చాలా వరకు తగ్గింది. నిర్వహణ లేక.. పాఠకులు రాక మూతపడ్డ గ్రంథాలయాలు చాలా వరకు ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని యువజన గ్రంథాలయం మాత్రం వీటికి భిన్నం. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపు మార్చుకుని.. విద్యార్థులు, యువత అవసరాలు తీరుస్తోంది. దీని వెనుక స్థానిక విశ్రాంత ఉద్యోగుల కృషి ఉంది. ప్రణాళికాబద్ధంగా నిర్వహణ చేపడుతూ... నేటి అవసరాలకు తగ్గట్టుగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.

1958లో ఈపూరుపాలెంలో కొందరు ఔత్సాహికులు ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. గత రెండు దశాబ్దాలుగా విశ్రాంత ఉద్యోగుల సంఘం దీని నిర్వహణను చూస్తోంది. పోటీపరీక్షలకు ఇతర రంగాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు ,దిన పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు. స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించి.. మారిన కాలానికి అనుగుణంగా డిజిటల్ గ్రంథాలయానికి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు సంఘం అధ్యక్షుడిగా పడవల లక్ష్మణస్వామి కొనసాగారు. వారి కుమారుడు జలవనరులశాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ పీబీఎన్ వరప్రసాద్ తండ్రి జ్ఞాపకార్థం ఎల్ఈడీ టీవీ, ఇతర పరికరాలు, బల్లలు సమకూర్చారు.

ఈనెల 27 వతేదీన ప్రారంభించిన డిజిటల్ లైబ్రరీలో డీఆర్​డీఏ విశ్రాంత శాస్త్రవేత్త మురళి వరప్రసాద్ ఆధ్వర్యంలో అంతరిక్షవిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతరిక్షకేంద్రానికి మనుషులు ఎలా వెళుతున్నారు.. తిరిగి భూమిపైకి ఎలా చేరుతున్నారనే అంశాలను వీడియోల ద్వారా తెలియజేస్తున్నారు. కేవలం అంతరిక్ష విజ్ఞానమే కాకుండా విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను అందిస్తున్నారు. ఆయా రంగ నిపుణులతో ఆన్​లైన్ వేదికగా సందేహాలను నివృత్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. అంతర్జాల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచుకుంటున్నారు.

ఇదీ చూడండి:

మంత్రికి తలనొప్పిగా మారిన వర్గ విభేదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.