Differences in Prakasam District YSRCP Leaders : ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పార్టీ స్థితి గతులపై ఆ పార్టీ నేత, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆయా నాయకులు, వారి వ్యతిరేక వర్గం ఎన్నాళ్ల నుంచో గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒంగోలు నియోజకవర్గం సమీక్షలో వర్గాలు, వాదనలు ఎదురు కానప్పటికీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన మనసులోని బాధనలు వెళ్లగక్కారు.
YCP Leaders Clash in front of Vijayasai Reddy : తన రాజకీయ ఎదుగుదలకు తన బావ వైవీ సుబ్బారెడ్డి కారణం అని అందరూ అంటారనీ.. కానీ ఆయన వల్ల తాను ఎలాంటి లాభం పొందలేదని చెప్పారు. రాజకీయంగా తనకు ఎలాంటి సాయం అందించలేదని, తన రాజకీయ ఎదుగుదలకు కారణం పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబమని, వాళ్లు తనకు ఎంతో సాయం చేసారని, వైవీ సుబ్బారెడ్డి వైఖరి వల్ల తాను, తన కుటుంబం నష్టపోయిందని తన భార్య, పుట్టింటికి దూరం అయ్యిందని ఆవేదన వెళ్లగక్కారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జిల్లా పార్టీ వ్యవహారాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్రకు ఎప్పుడూ పెద్ద పీటే ఉంటుందని, ఆయన నాయకత్వానే కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
War of Words Between Santnutalapadu YSRCP leaders : సమీక్షకు ముందు సంతనూతలపాడు నియోజకవర్గం వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే సుధాకర్ బాబు వర్గం, సంతనూతలపాడులో ఎంపీపీ అంజమ్మ వర్గానికి స్వల్వ ఘర్షణ చోటుచేసుకుంది. అంజమ్మ వర్గాన్ని సమావేశం మందిరంలోకి రాకుండా ఎమ్మెల్యే వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో అంజమ్మ ఆగ్రహానికి గురై, ఎమ్మెల్యే అనుచరుడిపై చేయి చేసుకున్నారు. సంతనూతల పాడు నియోజవర్గంలో ఒకే అభ్యర్థి రెండో సారి గెలిచిన సందర్భం లేదని, ఇప్పటికే నియోజకర్గంలో మూడు వర్గాలు విడిపోయి పని చేస్తున్నాయని విజయసాయిరెడ్డి ముందు ఏకరవు పెట్టారు.
హీరోల్లా ఫోజులొద్దు : మార్కాపురంలో వర్గాలు మరో సారి భహిర్గతం అయ్యాయి. ఎమ్మెల్యే నాగార్జున్ రెడ్డి, అతన సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి, మామ ఉడుమల శ్రీనివాసరెడ్టిలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని పలు మార్లు పత్రికలకు ఎక్కిన సూర్యప్రకాశ్ రెడ్డిని సమావేశానికి రాకూడదని ఎమ్మెల్యే వర్గం పట్టుపట్టింది. అతడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని వాదించింది. దీంతో విజయసాయిరెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. మీరేమైనా హీరోలు అనుకుంటున్నారా? అంటూ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వర్గీయుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా బాలినేని చూసుకుంటారని అన్నారు. బాలినేని కూడా సూర్యప్రకాశ్‌రెడ్డికి లోపలకు ఆహ్వానం పలకడంతో అక్కడతో సర్ధుమణిగింది. సమావేశంలో కూడా రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నిందులు వేసుకున్నారు.
Political War in YSRCP: కొండెపి వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు.. వెలసిన పోస్టర్లు..
గరం గరంగా గిద్దలూరు : గిద్దలూరు నియోజకవర్గం సమీక్షలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్గం, వ్యతిరేక వర్గం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్వరంతో కేకలు వేసుకొని, వ్యక్తి గత దూషణలకు పాల్పడ్డారు. బాలినేని కలుగజేసుకొని ఇరు వర్గాలను సముదాయించినా ఫలితం లేకపోవడంతో విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలు, కేకలు వేస్తే సహించేది లేదని, క్రమశిక్షణ తప్పితే ఈ క్షణమే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
సొంత పార్టీ వారి మీదే దాడులు : కొండెపి నియోజకవర్గ సమావేశంలో ఇన్చార్జి వరికూటి అశోక్ బాబుకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు గళం విప్పారు. అశోక్ బాబు సొంత పార్టీ వారి మీదే దాడులు నిర్వహిస్తున్నాడని, ఎవరినీ కలువుకొని వెళ్లడం లేదని తెలిపారు. అశోక్ బాబుకు టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితిలో పని చేసేది లేదంటూ వ్యతిరేక వర్గం ఖరాకండీగా చెప్పింది.