ETV Bharat / state

మార్కాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. వీరికి తెదేపా ఇంచార్జీ కందుల నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఉన్న కార్మికులను తీసేసి కొత్త వారిని విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Dharna of municipal workers in Markapuram
మార్కాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
author img

By

Published : Jan 3, 2020, 1:00 PM IST

మార్కాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మున్సిపల్​ కార్యాలయం ఎదుట ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. విధుల నుంచి తొలగించిన 20 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన తెలిపారు. వీరికి తెదేపా ఇంఛార్జీ కందుల నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఇన్ని రోజులు కష్టపడ్డ కార్మికులను తీసేసి కొత్తవారిని తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం మారడం తమకు శాపంగా మారిందన్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షలు లంచం తీసుకుని కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి:

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు

Intro:AP_ONG_81_03_KARMIKULU_DARNA_VO_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనువాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: తొలగించిన 20 మంది ఒప్పంద పారిశుద్ద కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం లో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తాము కార్మికులుగా ఇన్ని రోజులు కష్టబడి పని చేస్తున్నామని......ప్రభుత్వం మారడమే తమ శాపమా అని వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం ఎదుట బైఠాయించి వారు ధర్నా నిర్వహించారు. వీరికి తెదేపా ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి , మాజీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉన్న కార్మికులను తీసేసి వేరొకరిని విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకుని కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Body:కార్మికుల ధర్నా....

Conclusion:8008019243.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.