గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు వెలిగొండ ప్రాజెక్టులో 600 మీటర్లు మాత్రమే సొరంగం పనులు చేపట్టిందని...తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలల్లోనే 1.4 కిలీమీటర్ల మేర చేయించామని ప్రకాశం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ అన్నారని, సీఎం వ్యాఖ్యలపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మొదటి ఏజెన్సీ నాలుగున్నర సంవత్సరాల్లో3.8 కిలోమీటర్లు పనిచేసిందని వెల్లడించారు. అలాగే కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించాక గత ఆగస్టు నుంచి 2 కిలోమీటర్ల సొరంగం పనులు చేపట్టిందని స్పష్టం చేశారు. దీనిపై వైకాపా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాగే తెదేపా పాలనలో వెలిగొండ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సాక్షి పత్రికలో వచ్చిన వార్తను ఆయన ప్రస్తావించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే మొదటి టన్నెల్ పనుల్లో రివర్స్ టెండరింగ్ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
'వెలిగొండ ప్రాజెక్టుపై వైకాపా అసత్య ప్రచారాలు' - వెలిగొండ ప్రాజెక్టు పనుల వివాదం
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో తెదేపా హయాంలో జరిగిన పనులను కూడా జగన్ సర్కారు తమ ఖాతాలో కలిపేసుకొనే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఎం వైఖరిని తప్పుబట్టిన ఆయన.. సొంతమీడియాతో దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలన్నారు. వెలిగొండలో అవినీతి జరిగి ఉంటే రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి