సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్ష యాభై వేల నగదు, ఆరు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి పలువురికి ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎల్ఐసీ బీమా బోనస్ మీ అకౌంట్కు గానీ, కార్డుకు బదిలీ చేస్తామంటూ మాయమాటలు చెప్పి వారి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు గిద్దలూరు సీఐ సుధాకర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి :