కేంద్ర ప్రభుత్వం పోర్టులను ప్రైవేటీకరించడం వల్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరిగే ప్రమాదముందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనివల్ల దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆర్థిక నేరస్తులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేసిందని విమర్శించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి పన్ను ఎగవేతదారులు విదేశాలకు పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడులు సిగ్గుమాలిన చర్యని వ్యాఖ్యానించారు. "సేవ్ ఇండియా.. మోడీ హఠావో" నినాదంతో ఈ నెల 27వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తామని నారాయణ తెలిపారు. ఈ బంద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న అన్ని పోర్టులను ప్రైవేటీకరించడం సరికాదని నారాయణ వెల్లడించారు.
ఇదీ చూడండి: పరీక్షకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం