ఎన్ఆర్సీ, సీఏబీ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. అద్దంకి బస్టాండ్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ, సీపీఎం, సీపీఎమ్ఎల్, ఇతర వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఎన్ఆర్సీ బిల్లుకు వైకాపా మద్దతు తెలపడాన్ని వామపక్షాల నాయకులు తప్పుపట్టారు. దీనిపై ముఖ్యమంత్రి వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..