ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని తండాల్లో కొందరు పశువుల యజమానులు, కాపరులు వందల సంఖ్యలో గోవులను తోలుకుని ఆయకట్టు ప్రాంతానికి బయలుదేరారు. వేసవి రాక ముందే పశువులకు మేత కరువైందని... అందుకోసం వలస వెళ్తున్నామని కాపరులు తెలిపారు. వర్షాలు కురిస్తే తమ ప్రాంతాలకు తిరిగి వస్తామని పశు యజమానులు చెబుతున్నారు. జనవరి చివర్లోనే పశువులకు మేత దొరక్కపోవడంపై ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి: