ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతలలో ఓ వృద్ధ కాంపౌండర్‌కు కరోనా సోకడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో నేరుగా మాట్లాడినవారినే కాక.. విధి నిర్వహణ నిమిత్తం దగ్గరగా మెలిగిన మొత్తం 18 మందిని గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు.. సెకండరీ కాంటాక్ట్ కింద నెల్లూరులో 26 మందిని.. రావినూతలలో మరో 28 మందిని గుర్తించారు. ప్రస్తుతం ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న మొదటి 18 మందిని పరీక్షిస్తున్నారు. వారిలో ఎవరికైనా కరోనా సోకితే.. సెకండరీ కాంటాక్ట్ లో ఉన్న వారికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: