చిన్నారులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సైతం కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కూలీలుగా మారుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడిన వేళ.. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది జీవనం దుర్భరంగా మారింది. కుటుంబాలను పోషించుకోలేక, ఆర్థిక సమస్యలతో మానసికంగా, శారీరకంగా వేదనలకు గురవుతున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు కుటుంబాలను పోషించుకునేందుకు దొరికిన పనిలో చేరి కాలం వెళ్లదీస్తున్నారు. తిండి కూడా కరువైన పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలు, క్యాటరింగ్, టైలరింగ్ లాంటి చిన్నపాటి పనులు దొరికినా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అంతంతమాత్రం ఆదాయంతో కష్టాలు తప్పడం లేదని వారు వాపోతున్నారు.
ఇంటి అద్దెలు సైతం భారంగా మారి అవస్థలు పడుతుండగా... ఆదుకోవాల్సిన యాజమాన్యాలు ముఖం చాటేశాయని ప్రైవేటు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో తమను ఆదుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం సైతం చేయూత అందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు