ETV Bharat / state

కరోనాను జయించినా తప్పని అనారోగ్య సమస్యలు

author img

By

Published : Oct 29, 2020, 7:47 PM IST

కరోనా ఇంకా కలవర పెడుతోంది. కొలువులో ఉన్నవారిలో ఇతర అనారోగ్య సమస్యలు కలిగించి.. ఆందోళనకు గురిచేస్తోంది. అయినా జనం నిర్లక్ష్యం వీడటం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. మాస్కు తప్పనిసరి అన్న నిబంధనలు పాటించకపోయినా.. పట్టించుకునేవారేలేరు.

corona
corona

ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకూ కరోనాతో 567 మంది మరణించగా మిగిలినవారు అస్పత్రులు, హోంఐసోలేషన్​లో వైద్యం పొందుతున్నారు. రోజువారీ కేసుల తీవ్రత 70 నుంచి 80 శాతం వరకు తగ్గింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కరోనా ఇంకా కలవర పెడుతోంది. కొలువు ఉన్నవారిలో ఇతర అనారోగ్య సమస్యలతో అందోళనకు గురిచేస్తోంది. కరోనా అనంతరం ఇతర రుగ్మతలతో చాలామంది ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. తెలిసిన వైద్యుల వద్దకు వెళ్లి కరోనా చేసిన గాయాలను ఏకరువు పెడుతున్నారు.

ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మరికొన్ని నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం హెచ్చరికలు చేస్తున్నా.. కొందరు నిర్లక్ష్యం వీడటంలేదు. గుంపులుగా మాస్కు లేకుండా తిరగడం మారుమూల ప్రాంతాలలోనే కాదు.. జిల్లా కేంద్రంలోనే సర్వసాధారణం అయింది. మాస్కు తప్పనిసరి అన్న నిబంధనలు పాటించకపోయినా పట్టించుకునే నాధుడు లేడు.

చుట్టుముట్టిన రుగ్మతలు..

జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ ప్రభావంతో కుటుంబాలకు కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. కరోనాను జయించామని చాలా మంది సంబరపడ్డారు. అలాంటి అధికారులకు, నాయకులకు పూలతో ఘనస్వాగతం పలికి అభినందించారు. కరోనా టీకా లేపోవడం, వెద్యంలో భాగంగా కొందరికి స్టెరాయిడు, ఇతర బూస్టర్ మందులతో చాలామందిని వైద్యులు రక్షించారు.

అలా కోలుకున్న వారిలో చాలా మందిని ఇతర అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. ఊపిరితిత్తులు బిగుసుకుపోయినట్లు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, జలుబు ఉన్నట్లు మాటతీరులో మార్పులు, ఆయాసం, నీరసం, ఒళ్ళు నొప్పులు, తరచూ దగ్గు, మధుమేహం బారిన పడటం లాంటి జబ్బులతో కొందరు అస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే కోలుకున్న వారిలో రుగ్మతలు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. 20 నుంచి 40 ఏళ్ల వయసు వారు కోలుకున్న తర్వాత 7 రోజులోనే సాధారణ స్థితికి చేరుకుంటున్నారని.. అలానే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాజిటివ్ బారిన పడిన చిన్నారులు సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు.

అయినా వీడని నిరక్ష్యం ..

మాస్కుల ధరింపు, ఇతర జాగ్రత్తల పాటింపు మార్గదర్శకాలతో సినిమా థియేటర్లు, మాళ్లు, విద్యాలయాలు తెరుచుకోవడానికి ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా రెండో విడత ప్రమాదం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నవంబరులో నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ జనంలో మాత్రం కరోనా భయం, ఆరు నెలలపాటు ఎదుర్కొన్న ఇబ్బుందులను మరిచిపోయారు. జిల్లా కేంద్రం ఒంగోలుతోపాటు ఇతర అన్ని ప్రాంతాల్లో మాస్కుల వినియోగం అటకెక్కించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా పక్కనే నిలబడి తుమ్మడం, దగ్గడం లాంటివి చేస్తున్నారు. కొందరు పాజిటివ్ వచ్చి హోంఐసోలేషన్లో ఉన్నవారు సైతం యథేచ్చగా జనంలో తిరిగేస్తున్నారు.

అనారోగ్య సమస్యలతో అప్రమత్తత అవసరం

జిల్లాలో కేసుల తీవ్రత 70శాతానికి పైగా తగ్గింది. రోజుకు సరాసరిగా 200 నుంచి 300 వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. జీజీహెచ్ లో ప్రస్తుతం 400 మంది వరకు పాజిటివ్ రోగులు వైద్యం పొందుతున్నారు. అయినా నిరక్ష్యం చేయకుండా మరో రెండు నెలలు ప్రజలు అప్రమత్తంగానే ఉండాలి. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరు ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. పూర్తిగా కోలుకున్నాక కూడా 10 రోజులపాటు అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్ జాన్ రిచర్డ్స్, కొవిడ్ -19 నోడల్ అధికారి, రిమ్స్

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,905కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.