ఇరు వర్గాల మధ్య తలెత్తిన పొలం గట్టు తగాదా రాళ్లతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామంలో జరిగింది. ఇరువర్గాలు మెుదట పొలంలో పరస్పరం దాడి చేసుకోగా, గాయపడటంతో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తరలించారు.
గాయపడిన రెండు వర్గాల వారి బంధువులు, మధ్యవర్తులు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో మరలా ఘర్షణ మెుదలయ్యి, ఒకరినొకరు తోసుకున్నారు. వివాదం మరింత ముదరటంతో రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఒక వర్గం వారు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. గిద్దలూరు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణకు దారి తీసిన కారణాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు