Common man fires on Tahsildar veeraiah: చెప్పులు కుట్టుకుని బతికే తన జీవనాధారాన్ని దూరం చేశారంటూ.. ఓ వ్యక్తి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహసీల్దర్ వీరయ్యపై ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ముందు ఆవేదన వెళ్లగక్కారు. 15 అడుగుల స్థలం ఇస్తే.. దుకాణం పెట్టుకుని బతుకీడుస్తానని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఉపాధి దొరక్క తనలాంటి వాళ్లు నక్సలైట్‌గా మారక తప్పదని ఆక్రోశించారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఓ వ్యక్తి.. రోడ్డు పక్కన చిన్న దుకాణంలో చెప్పులు కుడుతూ జీవనం సాగించేవాడు. సుమారు 6 నెలల కిందట రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాన్ని తీసేశారు. అప్పట్లో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలం కేటాయించాలంటూ ఇన్‌ఛార్జి తహసీల్దార్ వీరయ్య చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు.
ఇదీ చదవండి:
Suspension: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసు.. 17మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్