ETV Bharat / state

'కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు' - citu rally at kanigiri news update

కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నాయకులు అన్నారు. కనిగిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కార్మిక చట్టాల్లో పలు మార్పులు చేసి, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు.

Breaking News
author img

By

Published : Oct 20, 2020, 12:22 PM IST

కాంట్రాక్ట్ కార్మికులు, షెడ్యూల్ కార్మికులు, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఎంపీడీఓ కార్యాలయం నుంచి కార్మికశాఖ కార్యాలయం వరకు ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికశాఖ అధికారి సుబ్బరాయుడికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కేశవరావు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి... అద్దెల దరువు ఆగేనా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.