ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని సుందరయ్య భవన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భౌతిక దూరం పాటిస్తూ నాయకులు దీక్ష చేశారు. అద్దంకి సీఐటీయూ నాయకులు గంగయ్య హాజరయ్యారు. లాక్డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలతో కూడిన సెలవు ప్రకటించాలని, కార్మికుల హక్కులపై దాడి విరమించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: