ETV Bharat / state

చిన్నారుల సేవలో ఛాంపియన్లు.. రాష్ట్రస్థాయిలో పురస్కారాలు

ప్రపంచమంతా కరోనాతో బెంబేలెత్తుతున్నా వారు మాత్రం విధులను వదల్లేదు. కనీస అవసరాలకు బయటకు రావడానికి ప్రజలు వెనకడుగేస్తే వారు ధైర్యంగా ముందుకు కదిలారు. ఎంతోమంది గర్భిణులకు ఆసుపత్రికి చేర్చి ప్రసవం జరిగేలా ఒకరు చేస్తే.. బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై మరొకరు మరొకరు అవగాహన కల్పించారు..

women awards
చిన్నారుల సేవలో ఛాంపియన్లు.. రాష్ట్రస్థాయిలో పురస్కారాలు
author img

By

Published : Jan 15, 2021, 5:55 PM IST

ఆమె దృఢ సంకల్పం ముందు కరోనా ఓడింది... ఓ గర్భిణిని కాపాడేందుకు దివ్యాంగురాలైన నడింపల్లి అంగన్‌వాడీ కార్యకర్త పరిశపోగు కొండమ్మ చూపిన చొరవ ప్రశంసనీయం. కొవిడ్‌-19 తీవ్రత అధికంగా మే నెల 16వ తేదీన తన కేంద్రం పరిధిలో ఉండే ఓ గర్భిణికి అర్ధరాత్రి పురిటినొప్పులు రావడం, అందుబాటులో 108 కూడా లేకపోవడంతో ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తల్లీబిడ్డను కాపాడింది. ఉన్నతాధికారుల సూచనలతో తన మూడు చక్రాల బండి మీద గర్భిణిని జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చి ప్రసవం జరిగేలా చేయగలిగింది. వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆమె అందించిన నిస్వార్థ సేవకు ఐసీడీఎస్‌ ‘ఛాంపియన్‌’ పురస్కారంతో సత్కరించింది. కరోనా సమయంలోనూ తన సైకిల్‌పై చిన్నారులు, గర్భిణుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారం అందించారు. సాధారణ రోజుల్లోనూ చిన్నారులను తన ట్రైసైకిల్‌పై కేంద్రానికి తీసుకొచ్చి పాఠాలు చెప్పేవారు.

చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ..

చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా పాఠాలు బోధిస్తుండటమే కాకుండా, పిల్లల ఆరోగ్యానికి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ ఐసీడీఎస్‌ ఛాంపియన్‌ పురస్కారాన్ని అందుకున్నారు భాగ్యలక్ష్మి. అద్దంకి మండలం మైలవరం పంచాయతీ ఏలేశ్వరపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పని చేస్తున్న ఆమె చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వం నుంచి వస్తున్న పోషకాహారంతో వివిధ రకాల పిండివంటలు తయారు చేసి నిత్యం చిన్నారులకు అందిస్తూ, ఇళ్లలో కూడా ఎలాంటి పదార్థాలు పెట్టాలో తల్లులకు వివరిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వీటితో పాటు బోధనకు సృజనాత్మకతను జోడించి తన కేంద్రానికి వచ్చే 18 మంది పిల్లలకు ప్రత్యేక పరికరాలతో సులభరీతిలో బోధన చేస్తున్నారు. ఇదే క్రమంలో బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ఆమె సేవలను గుర్తించిన అధికారులు ‘ఛాంపియన్‌’ పురస్కారంతో సత్కరించారు.

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా..

కడవకుదురు అంగన్‌వాడీ కేంద్రం-6 కార్యకర్త కొల్లా వాణి సాంకేతికతను ఉపయోగిస్తూ పిల్లలు, తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొన్నారు. బీఏ సోషియాలజీ చదివిన ఆమె తన కేంద్రాన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దారు. ఉన్నతాధికారిణుల సూచనలు, సలహాల మేరకు పిల్లలకు చదువు చెప్పేందుకు సులభతరమైన రీతిలో బోధనోపకరణాలను తయారు చేశారు. ఐడీసీఎస్‌ శాఖ వారిచ్చిన నిధులతోనే కాకుండా కొంతమేర తన సొంత నిధులను ఉపయోగించి విద్యారులకు బోధిస్తున్నారు. బాలింతలు, గర్భిణులు పోషకాహారం తీసుకునే విషయంలో ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారు. కేంద్రంలో ఉండే పిల్లల తల్లిదండ్రులందరినీ కలిపి వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, నిత్య సమాచారం అందిస్తున్నారు. ఆరోగ్య సూచనలు, పాఠాల విశేషాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌-19 తొమ్మిది నెలల కాలంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ చిన్నారులకు పౌష్టికాహారం, ఇతర సేవలు అందించినందుకు గాను ‘ఛాంపియన్‌’ పురస్కారం పొందారు.

ఇదీ చదవండి: శింగరకొండ దేవస్థానికి గోవును సమర్పించిన తితిదే ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.