గడువు ముగిసిన చుక్కల మందు తాగించడం వల్ల తమ పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ప్రకాశంజిల్లా, ముండ్లమూరు మండలం పసుపుగల్లులో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం:
కురుచేడు మండలం నమ:శివాయపుర అగ్రహారానికి చెందిన కేశనపల్లి నవనీతం స్వగ్రామమైన పసుపుగల్లుకు వచ్చారు. 17 రోజుల క్రితం చీమకుర్తిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నవనీతం.. పాపకు జన్మనిచ్చింది. పాపకు వాంతులు, విరేచనాలు అవుతున్న కారణంగా.. ముండ్లమూరుకు చెందిన ఓ ఆర్ఎంపీకి చెప్పి.. మందులు తెప్పించారు. అతను రెండు రకాల మందులు ఇచ్చాడు. వాటిని తాగించిన అరగంట వ్యవధిలో నోటి వెంట నురగలు వచ్చి బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ మందులను పరిశీలించగా గడువు తేదీ ముగిసినట్లుగా ఉందని కుటుంబసభ్యులు చెప్పారు. పాప మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆర్ఎంపీ, మందుల దుకాణదారుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: