ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం బయటపడింది. జోషి డిఫెన్స్ అకాడమీ పేరుతో యువకులకు పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగదు వసూలు చేసి మోసగించింది. కోచింగ్ పేరుతో అకాడమీ నిర్వాహకుడు కే. జోషి మరింత సొమ్ము వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి జోషిని అదుపులోకి తీసకున్నారు.
సుమారు ఏడుగురి దగ్గర 4 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల అవుతుంది... దాని ద్వారానే ఉద్యోగాలు సాధించవచ్చని సీఐ హైమారావు సూచించారు. అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగాలు రాకపోగా విలువైన సమయం, నగదు పోతాయన్నారు.
ఇదీ చదవండి