ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఎకో ఫ్రెండ్లీ స్వచ్ఛంద సేవా సంస్థ వారు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. స్వయంగా స్థానిక కంభం చెరువులోని మట్టిని తీసుకొచ్చి విగ్రహాలు తయారుచేశారు. దాదాపు 2వేల వినాయక విగ్రహాలను తయారు చేసి స్థానిక ప్రజలకు గత పదేళ్లుగా అందజేస్తున్నారు. మట్టి విగ్రహాలు తయారుచేయడం... వాటిని పంపిణీ చేయడం కారణంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నామని ఆ సంస్థ బాధ్యులు చెప్పారు. పర్యావరణ హితంగా... వినాయక చవితి చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
ఇదీ చదవండీ...రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు