ETV Bharat / state

నీటి సంరక్షణకు ఉపాధిలో ప్రాధాన్యం... నేటి నుంచి గ్రామసభల నిర్వహణ - Central Government is helping to prevent migration in villages.

గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అరకొరగా కురిసే వాన నీటిని భూగర్భంలో దాచుకునేలా.. నీటి సంరక్షణ పనులకు ఈ సారి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

five thousand working days for each village with mahatma gandhi gramina upadhi hami scheme
గ్రామానికి 5 వేల పనిదినాలు... నీటి సంరక్షణకు ఉపాధిలో ప్రాధాన్యం
author img

By

Published : Nov 2, 2020, 4:36 PM IST

గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో పనుల గుర్తింపునకు ముందస్తుగా సోమవారం నుంచి గ్రామసభలను జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నారు. అరకొరగా కురిసే వాన నీటిని భూగర్భంలో దాచుకునేలా.. నీటి సంరక్షణ పనులకు ఈ సారి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి ఈ తరహా పనులతో పాటు, పండ్లతోటల సాగు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

డిసెంబర్‌ నెలాఖరుకు మంజూరు!

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టాల్సిన పనుల జాబితా తయారీలో డ్వామా అధికారులు నిమగ్నమయ్యారు. కూలీల డిమాండ్‌కు అనుగుణంగా గ్రామానికి అయిదు వేల పని దినాల చొప్పున ఉండేలా పనులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. తక్కువ జనాభా కలిగిన పంచాయతీల్లో పని దినాల సంఖ్య తగ్గనుంది. కొత్త పనులు గుర్తింపు నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ఈ నెల రెండో తేదీ నుంచి నెలాఖరు వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించన్నారు. నవంబర్‌ నెలాఖరులోపు గుర్తించిన పనుల వివరాలను మండలాల నుంచి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు అందజేయనున్నారు. అనంతరం డిసెంబర్‌ నెలాఖరుకల్లా పనుల మంజూరు తీసుకోనున్నారు. ప్రస్తుత ఏడాదికి అదనంగా రాబోయే ఏడాదికి కూడా మూడు కోట్ల మేర పని దినాలు ఉండేలా గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం

జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రహదారుల వెంట, ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టనున్నాం. రైతులకు వ్యవసాయ ఉత్పాదకత పెంచేలా పండ్ల తోటల సాగును ప్రోత్సహించనున్నాం. డిసెంబర్‌ నెలాఖరుకల్లా మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నాం. - శీనారెడ్డి, పీడీ, డ్వామా

2020-21 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన కార్డులు7 లక్షలు
ఉపాధి పనులకు వస్తున్న కూలీల సంఖ్య5 లక్షలు
ప్రస్తుత ఏడాది పని దినాల లక్ష్యం2.64 కోట్లు
ఇప్పటి వరకు చేసిన వ్యయంరూ.730 కోట్లు
2021-22 సంవత్సరానికి పని దినాల లక్ష్యం 3 కోట్లు

ఇదీ చదవండి:

తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.