ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధమైంది. ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు... తన తల్లిని తీసుకుని విజయవాడకు బయలుదేరాడు. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న టోల్‌ప్లాజా, హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, ఆయన తల్లి కారు నుంచి దిగిపోయారు. కారు లోపలి భాగమంతా దగ్ధమైంది. టోల్ ప్లాజా సిబ్బంది చొరవను స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి :