ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు నుంచి గుంటూరు బయల్దేరుతున్న కారును మార్టూరు సర్వీసు రోడ్డు వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మురళీ మోహన్, లక్ష్మీ, సుశీల, సామ్రాజ్యం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మార్టూరు ఆసుపత్రికి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. వీరిలో సామ్రాజ్యం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి