ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి చెందిన వనపర్తి నాగరాజు, మరియమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చిన సంపాదనతో తమ ఇద్దరు కుమారులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు సంపత్ 9వ తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో డిష్ బిల్లు కట్టమని సంపత్‌కు అతని తల్లి మరియమ్మ రూ.500 ఇచ్చింది. అయితే ఆ నగదును సంపత్.. తన స్నేహితులతో కలిసి సొంత ఖర్చుల కోసం వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న నాగరాజు, మరియమ్మలు సంపత్‌ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సంపత్.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సంపత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీచదవండి.