ETV Bharat / state

ఓటేయలేదని బోరు తొలగించారు.. దిక్కెవరని రైతు ఆత్మహత్యాయత్నం - వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్

Farmer Attempt Suicide: వైఎస్సార్సీపీ నాయకులు తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో రైతుల పంటకు నీరు అందనివ్వకుండా చేశారు. వారికి సపోర్టుగా ప్రభుత్వ ఉద్యోగులు సహకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. అయ్యయ్యో కాపాడప్ప భగవంతుడా అంటూ రోదిస్తూ ఆవేదన తెలుపుతున్న ఓ రైతు వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

mpdo removed bore
బోరును తొలగించిన వైసీపీ నాయకులు
author img

By

Published : Feb 24, 2023, 5:52 PM IST

రైతు ఆత్మహత్యాయత్నం

Farmer Attempt Suicide : గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఉద్ధేశ్యంతో వారిపై కోపం పెంచుకున్నారు వైఎస్సార్సీపీ నాయకులు. టీడీపీ మద్దతుదారులను ఎలాగైనా దెబ్బతీయాలని సమయం కోసం ఎదురు చూస్తున్న వైఎస్సార్సీపీ నాయకులకు.. ఆ సమయం రానే వచ్చింది. చేతికి అందిన పంటకు నీరు అందకుండా చేశారు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే వారిని.. బాధ పెట్టడం ఏంటని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

అధికారులపై ఒత్తిడి : టీడీపీకి ఓటు వేశారనే నెపంతో కాపు కొచ్చిన మిరప పొలానికి నీళ్లు అందించే బోరును తొలగించిన దారుణమైన ఘటన మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటు చేసుకుంది. ఓ మహిళ విలపిస్తూ ఎంత వేడుకున్నా.. కొంచెం కూడా కనికరం లేకుండా బోరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. జమ్మనపల్లిలో సొంత భూముల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ గ్రామంలో దూల కాశీరావు, చిట్యాల సుబ్బారెడ్డిలు టీడీపీకి చెందినవారు. సర్పంచ్ ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వలేదనే కారణంతో వారిపై అధికార పార్టీ నాయకులు కక్ష గట్టారు. గ్రామంలో వారు వేసుకున్న బోరును తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

వాల్టా చట్టం ఉల్లంఘన : దీంతో గ్రామానికి చేరుకున్న ఎంపీడీఓ చందన, ఎస్సై సుమన్ సమక్షంలో బోరును తొలగించారు. మిర్చి పంట కాయ దశలో ఉందని బోరున విలపిస్తూ దండం పెట్టి వేడుకున్నా వారు కనికరించలేదు. వాల్టా చట్టం ఉల్లంఘన కింద బోరు ఉందని అధికారులు సమాధానం ఇచ్చారు. ఇదే గ్రామంలో ఇలానే మరో 11 బోర్లు ఉన్నా కూడా అధికారులు వాటి జోలికి మాత్రం వెళ్లలేదు. దీంతో కాశిరెడ్డి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు ఒంటిపై నీళ్లు పోసి ప్రమాదం నుంచి తప్పించారు. ఆ పరిస్థితి చూసిన గ్రామస్థులంతా అధికార పార్టీ అయినంత మాత్రాన ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ చర్చిచుకుంటున్నారు.

రైతు ఆవేదన.. వీడియో నెట్టింట వైరల్: శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో తిప్పేస్వామి అనే రైతు అప్పు చేసి మూడు ఎకరాల పొలంలో వేరుశనగ పంట పెట్టాడు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరాలో కోతలు విధించడంతో వేరుశనగ పంట ఎండిపోతుండడంతో ఆ రైతు తన పొలంలో గగ్గోలు పెడుతూ రోదిస్తూ భగవంతుని వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

'అయ్యాయ్యో.. ఏమప్పా శివయ్య.. మా పరిస్థితి ఏంటి అప్పులు చేశాం మాకు దిక్కెవరు.. మాకు ఎవరు పట్టించుకునే వారే లేరే..' అంటూ కన్నడ భాషలో తన ఆవేదనను ఆ వీడియోలో తెలిపాడు. వీడియో చూసిన పలువురు ప్రభుత్వం, అధికారుల తీరుపై నెట్టింట మండిపడుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.