ETV Bharat / state

కరోనాను జయించారు... బ్లాక్ ఫంగస్​కు చిక్కారు!

author img

By

Published : May 16, 2021, 6:03 PM IST

ఒంగోలులో కరోనాతో కోలుకున్న ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్​కు గురయ్యాడు. కన్ను, దవడ, వాపు రావటంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షించగా బ్లాక్ ఫంగస్​ ఇన్ఫెక్షన్​గా డాక్టర్లు గుర్తించారు. వైద్యానికి 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు.

బ్లాక్ ఫంగస్​కు సంబంధించిన రిపోర్టు
బ్లాక్ ఫంగస్​కు సంబంధించిన రిపోర్టు
మాట్లాడుతున్న మాలతి

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం లో సీతారాంపురం కాలనీకి చెందిన పందిపట్ల శ్రీనివాసులు... గత ఏప్రిల్ 20న కరోనా కారణంగా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కోలుకున్న తర్వాత కన్ను, దవడ వాపు రావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేరారు. ఆయన్ను పరీక్షించగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్​గా డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం చెన్నై ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కొరకు వేచి ఉండగా... వైద్యానికి సుమారు 20 లక్షల రూపాయలు అవుతాయని వైద్యులు చెప్పారు. ఒంగోలు నగరంలో ఉంటున్న పదిమంది స్నేహితులు కలిసి సుమారు మూడు లక్షల రూపాయలు సేకరించి పంపారని... స్నేహితుడు ప్రసాద్ పేర్కొన్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని స్నేహితులందరూ వేడుకున్నారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఉంటున్నా... అతని భార్య మాలతి ఆరు నెలల గర్భవతి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రసాద్ పేర్కొన్నారు.

శ్రీనివాసులు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్​కి గురికావడంతో అతని భార్య మాలతి మాట్లాడుతూ.. వైద్యానికి సుమారు 20 లక్షల రూపాయలు అవుతాయని వైద్యులు చెప్పారని... దాతలు ఎవరైనా సాయం చేస్తే తన భర్తను బతికించుకుంటామని వేడుకుంది.

ఇదీ చదవండి:

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

'తౌక్టే' తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.