రాష్ట్రంలో పాలన కక్షపూరితంగా సాగుతోందని... నిర్మాణాత్మకంగా ఎక్కడా ఒక రోడ్డు కానీ, పోర్టుకానీ, విమానాశ్రయం కానీ నిర్మించలేదని మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. పారదర్శక ఇసుకవిధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... ఇప్పుడు స్థానికంగా ఇసుక దొరకని పరిస్థితిని కలిపించిందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకే గుప్పెడు ఇసుక దొరకటంలేదని ఎత్తిచూపుతున్నారని... సరళీకృతంగా ఇసుక పంపిణీ చేసే సామర్ధ్యం లేదా అని వైకాపా ప్రభుత్వాన్ని పురంధేశ్వరి ప్రశ్నించారు.
ప్రధాని ఏడాది పాలన ప్రశంసనీయం..
ఆరు సంవత్సరాల పాలనతో ప్రధాని మోదీ తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారన్నారు. కరోనా మహమ్మారి ప్రబలతున్న సమయానికి దేశంలో పరీక్షల నిర్వహణ పరికరాలు, పీపీఈ కిట్ల కొరత ఉందన్నారు. ప్రధాని తన చాకచక్యంతో.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా... ప్రస్తుతం దేశంలో రోజుకు 5 లక్షల పీపీఈల ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. అలాగే మనదేశ అవసరాలకు తయారవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను 55 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు.
ఇవీ చదవండి: ట్రెండింగ్లో 'ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు' హ్యాష్ టాగ్