ETV Bharat / state

నా తప్పుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: మాజీమంత్రి బాలినేని - మాజీమంత్రి బాలినేని తాజా వార్తలు

BALINENI: జిల్లాకు చెందిన వైకాపా నేతలు, ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరులో మహిళ విషయంలో జరిగిన వివాదంలో తనను అనవసరంగా లాగుతున్నారని అన్నారు. ఆమె కుటుంబ గొడవల విషయంలో తెలుగుదేశం పార్టీ వారు ఆమెను వెనుకేసుకొచ్చి,.. తాను ఇబ్బంది పెట్టినట్లు రాద్ధాంతం చేశారన్నారు.

BALINENI
'నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది.. ప్రతిపక్షంతో మా నేతల కుమ్మక్కు'- మాజీమంత్రి బాలినేని
author img

By

Published : Jun 28, 2022, 7:09 AM IST

BALINENI: జిల్లాకు చెందిన వైకాపా నేతలు, ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తనకు సంబంధంలేని విషయాలను కూడా తనకు ఆపాదించి విమర్శలు చేయడం బాధగా ఉందన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరులో మహిళ విషయంలో జరిగిన వివాదంలో తనను అనవసరంగా లాగుతున్నారని అన్నారు. ఆమె కుటుంబ గొడవల విషయంలో తెలుగుదేశం పార్టీ వారు ఆమెను వెనుకేసుకొచ్చి,.. తాను ఇబ్బంది పెట్టినట్లు రాద్ధాంతం చేశారన్నారు. తెలుగుదేశం నేత దామచర్ల జనార్దన్‌తో పాటు మరికొందరు తెలుగుదేశం నేతలు, వైకాపా నేతలు కూడా.. ఆమెతో రోజూ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఏం అన్యాయం చేశానని తనపై ఇంత కుట్ర చేస్తున్నారని బాలినేని ప్రశ్నించారు. కుట్రపై పవన్‌కల్యాణ్‌ కూడా వాస్తవాలు తెలుసుకోవాలని.. ఒకవేళ తన తప్పు ఉందని తేలితే.. రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని తేల్చిచెప్పారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న ఆయన.. వాటిని ఎస్పీకి ఇచ్చి విచారణ చేయమని కోరతానని చెప్పారు. అన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

'నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది.. ప్రతిపక్షంతో మా నేతల కుమ్మక్కు'- మాజీమంత్రి బాలినేని

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.