నరసరావుపేట నుంచి నంద్యాల వెళ్లేందుకు పవన్ కుమార్ దేశాయ్ అనే మహిళ రైలెక్కింది. తమ కూతురు ఆరోగ్యం బాగోలేదని కబురు రాగా.. హడావుడిగా రైలులోనే బ్యాగ్ మరచిపోయి వినుకొండ రైల్వే స్టేషన్లో దిగింది. కొంత సమయం తరువాత బ్యాగ్ మరిచిపోయినట్లు గ్రహించిన ఆమె వినుకొండ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అక్కడి నుంచి మార్కాపురం రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. మార్కాపురంలో నిలిచిన రైలు నుంచి బ్యాగ్‌ను ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. బ్యాగ్‌లో బంగారు ఆభరణాలు, నగదు, మూడు చరవాణులు అన్నీ ఉన్నందున పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి :