ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తుమ్మలబైలులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన చెంచు యువకులు బాణాలతో దాడి చేసుకున్నారు. ఘటనలో దాసరి మూగన్న అనే యువకుడి కడుపులోకి బాణం చొచ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన మూగన్నను మెుదట దోర్నాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఒంగోలు తరలించేందుకు సిద్ధమయ్యారు. అంబులెన్స్‌లో బాధితుడిని తీసుకువెళుతుండగా..మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీచదవండి