ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరంలోని ఓ వివాహ వేడుకలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కిలారి అబ్రహాం... వివాహ వేడుక నిమిత్తం విందు ఏర్పాటు చేశాడు. భోజనం చేసేందుకు వచ్చిన బాలయ్య అనే వ్యక్తి... తనకు మందు, ముక్క ఇవ్వలేదని నిర్వాహకులపై విర్రవీగిపోయాడు. అతనితో పాటు మరో ముగ్గురు దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. అడ్డు చెప్పిన నాగభూషణం, సంతోష్ అనే వ్యక్తులపై... కర్రలు, బీరు సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాగభూషణం తలకు బలమైన గాయం కాగా.. మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. తమపై అన్యాయంగా దాడి చేసిన వాళ్లను... ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: