కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరులో అలుపెరుగకుండా పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన ప్రజలను పరీక్షించటానికి దర్శి మోడల్ పాఠశాలలో 100 పడకలతో క్వారంటైన్ గదలు ఏర్పాటు చేశామన్నారు. వైరస్ గురించి ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. స్వీయనియంత్రణ ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చని సూచించారు. అవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి