ప్రకాశం జిల్లాలోని విజయవాడ - చెన్నై మార్గంలో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వేటపాలెం మండలం రావురిపేటలోని కనక నాగ వరపమ్మ దేవస్థానానికి వెళ్లే దారిలో ఉన్న ఆర్చ్‌ను రైల్వే సామాన్లు తరలించే వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్చ్ పూర్తిగా కూలిపోయింది. ఆసమయంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై వాహనదారుడిని స్థానికులు నిలదీయటంతో దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారాన్ని పునర్నిర్మిస్తామని గుత్తేదారు హామీఇచ్చారు.
ఇదీ చదవండి