ETV Bharat / state

'ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని కూడా అమలు చేయరా..?' - CM Promises to Journalists news

రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించాలని... కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్​కు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు బహిరంగ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద లేఖ విడుదల చేసిన సుబ్బారావు.. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

APWUJ Demands CM Promises to Journalists

author img

By

Published : May 18, 2021, 7:20 PM IST

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు

రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించి.. 50 లక్షల బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వాక్సిన్ ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోకపోగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మీడియా సంస్థలపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనా ఫస్ట్ వేవ్​లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా.. ఇంత వరకూ పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు.

సెకండ్ వేవ్​లో మరో 70 మందికిపైగా జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన సమాచార శాఖ మంత్రి ఎక్కడున్నారో ఎవరికి తెలియదని సుబ్బారావు పేర్కొన్నారు. జర్నలిస్టులకు సీఎం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ... 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.