ప్రకాశం జిల్లా.. గిద్దలూరు మండలం, మొడంపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవీందర్ రెడ్డికి అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేశారు. వాహనంలో తరలిస్తున్న 45 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని గిద్దలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం