శాసన మండలిని రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన సరికాదని.. సీపీఎం శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం.. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరైన వీరు.. మండలి రద్దు చేస్తారన్న అంశంపై స్పందించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించిన తరువాత అధికార పక్ష సభ్యుల తీరు సరిగా లేదని ఆక్షేపించారు. పెద్దలసభ ప్రతిష్ఠను కించపరిచారని అన్నారు. మంత్రులే ఛైర్మన్‌ను ముట్టడించడం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: