ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని అమ్మవారి ఆలయం సమీపంలోగల చెట్ల పొదల్లో గుర్తు పట్టలేని విధంగా ఉన్న మనిషి ఎముకలు, పుర్రె లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహం ఎముకలు, పుర్రె, అతనికి సంబంధించిన చెప్పులు, దుస్తులు పరిశీలించారు.
మృతుడు దర్శిలో గత నెల 23 నుంచి కనిపించకుండా పోయిన ఏఎస్వో వెంకటేశ్వర్ రెడ్డిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఘటనా స్థలంలో గుర్తులను అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో అదృశం.. వంతెన దగ్గర మృతదేహం..