ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు.. అసలు పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా రావుపాడు గ్రామానికి చెందిన పూతలపాటి ప్రశాంత్... తాను పోలీసునంటూ ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని.. వారి నుంచి డబ్బులు కాజేస్తుండేవాడు. ఈ క్రమంలోనే జూలై 30న కృష్ణంశెట్టిపల్లి నుంచి వస్తున్న సుబ్బారవు అనే వ్యక్తిని ఆపి... మీరు పేకాట ఆడి వస్తున్నారని అంటూ అతని వద్దనున్న 2,200 రూపాయల నగదను వసూలు చేశాడు. రెండు రోజుల క్రితం ప్రశాంత్ అదే విధంగా పుల్లయ్య అనే వ్యక్తిని ఆపి సుబ్బారావుకు చెప్పినట్లు చెప్పి 22,000 నగదు తీసుకువెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఘా ఏర్పాటు చేసి బేస్తవారి పేట వద్ద గంజాయితో పట్టుపడిన ప్రశాంత్‌ను విచారించగా.. ఆ నేరాలు తనే చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : అనధికారంగా మద్యం విక్రయం.. 239 సీసాలు స్వాధీనం