ETV Bharat / state

అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అంబులెన్స్... ముగ్గురికి తీవ్ర గాయాలు - bodduvanipalem ambulance accident updates

ప్రమాదం జరిగి గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్తున్న అంబులెన్స్... ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 108 వాహన డ్రైవర్​, బాధితుడు, బాధితుడి బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి.

ambulance accident
అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన 108 అంబులెన్స్
author img

By

Published : Mar 15, 2021, 3:29 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం సమీపంలో 108 వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్​తో పాటు అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ముండ్లమూరు మండలానికి చెందిన 108 వాహనంలో... ఓ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ముండ్లమూరు నుంచి ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో బొడ్డువానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అంబులెన్స్ ఢీకొట్టిన ధాటికి.. విద్యుత్ స్తంభం విరిగిపోయి కరెంట్​ వైర్లు పక్కనే ఉన్న పాఠశాలపై పడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ఘటనలో 108 అంబులెన్స్ డ్రైవర్, ప్రమాద బాధితుడు, బాధితుడు బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మరో 108 వాహనంలో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.