రాజధాని నిర్మాణానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లో ఎండగడతామని.. అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ, ప్రకాశం జిల్లా జేఏసీ నాయకులు ఒంగోలు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. 13 జిల్లాల్లోని నియోజకవర్గ, మండల స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు.
ఈనెల 16, 17 తేదీల్లో ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, కార్యాచరణ రూపొందిస్తామని.. అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలొనే రాజధాని కొనసాగాలని ఏడాదికిపైగా ఆందోళన జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
ప్రకాశం ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు... డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు..!