ETV Bharat / state

తోట... ఆమంచి భేటీ - JAGAN

ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడే యోచనలో ఉన్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీని విడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

THOTA
author img

By

Published : Feb 7, 2019, 12:07 AM IST

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో సమావేశమయ్యారు. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో భేటీ అయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గంటకు పైగా సమాలోచనలు సాగినట్లు తెలిసింది.

ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడే యోచనలో ఉన్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన‌ వైకాపాలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను ఆమంచి తెలుసుకున్నారు.

13న వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా కృష్ణమోహన్ ఆ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీని విడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్‌తో సమావేశమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Udhampur (Jammu and Kashmir), Feb 06 (ANI): One person died and 22 were injured after a mini-bus overturned in Jammu and Kashmir's Udhampur today. This incident took place on Dhar Road in Udhampur. The injured were immediately shifted to the district hospital for medical treatment. Police, Indian Army, paramilitary personnel assisted by locals launched a rescue mission to evacuate the injured.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.