కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సంఘీభావ సదస్సు నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చలిని సైతం లెక్కచేయకుండా రైతులు బలంగా పోరాటం చేయడం వల్లనే కేంద్రం వెనక్కి తగ్గిందని సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేవలం కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికే చట్టాలను తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. అఖిల భారత కిసాన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సౌత్ బైపాస్ రోడ్డు నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా పీవీఆర్ హై స్కూల్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. కమిటీ జాతీయ సహాయ కార్యదర్శి కామ్రేడ్ విజు కృష్ణన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్లీలో ఉద్యమంలో అమరులైన సుమారు 50 మంది రైతులకు జోహార్లు అర్పించారు. వారి ఆశయసాధనకు ముందుకు వెళదామని రైతు సంఘాలు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: