అక్రమాలకు పాల్పడిన తెదేపా నేతల్ని అరెస్టు చేస్తుంటే... రాజ్యంగా విరుద్ధం అన్నట్లు ఆ పార్టీ ప్రవర్తిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ విమర్శించారు. రాష్ట్రపతికి, గవర్నర్కు ఫిర్యాదు చేసి రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి వికేంద్రీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారో తెదేపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని.. ఆ వర్గాల కోసం రూ.20 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టు వివరించారు. గతంలో జరిగిన వ్యవహారాలను బయటపెడుతుంటే తెదేపా నేతలు రాష్ట్రపతి వద్దకు, గవర్నర్ వద్దకూ వెళ్తున్నారని ఆదిమూలపు సురేశ్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి