ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అద్దంకి మండలం వెంకటాపురానికి చెందిన దేవరపల్లి శ్రీనివాస్రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి అత్తవారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు.
ఇదీ చూడండి: వర్షాలతో అధ్వాన్నంగా రోడ్లు..రాకపోకలకు అవస్థలు