ETV Bharat / state

దారుణం... బాలికపై పదిహేను రోజుల నుంచి అత్యాచారం - ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారం వార్తలు

దంపతులకు లంకెబిందెల ఆశచూపి వారి ఇంట్లోనే అద్దెకు ఉంటూ ఓ వ్యక్తి క్రూరత్వాన్ని బయటపెట్టాడు. వారితో నమ్మకంగా ఉంటూనే.. పదిహేను రోజుల నుంచి అత్యాచారం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

A man raped  girl  since ten days in prakasham district
నిందితుడిని కొడుతున్న గ్రామస్థులు
author img

By

Published : May 17, 2020, 9:43 PM IST

Updated : May 18, 2020, 6:14 PM IST

నాలుగు నెలల క్రితం క్షుద్ర పూజల నిమిత్తం విష్ణువర్ధన్ అనే యువకుడు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చిన ఆ యువకుడు ఓ బాలిక పై కన్నేశాడు. ఎలాగోలా ఆ బాలికను లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్నాడో ఏమో అంతే ఆ బాలిక తండ్రికి గుప్త నిధుల ఆశ పుట్టించాడు. మీ ఇంట్లో పూజలు చేస్తే గుప్త నిధులు దొరికి ఆర్థికంగా బలపడతారని నమ్మించాడు. అలా పూజలు చేసేందుకు మీ కుమార్తెను నగ్నంగా పూజలో కూర్చోబెట్టాలని కోరాడు.

డబ్బుకు ఆశపడిన తండ్రి సరేనన్నాడు. దాంతో ఆ క్షుద్ర పూజారిలోని క్రూరత్వం బయట పడింది. 15 రోజులుగా ఆ బాలిక పై అత్యా చారానికి తెగబడ్డాడు. బాలిక ఆ విషయాన్ని తండ్రికి చెప్పినా... పూజారి చెప్పినట్లే చేయాలని బాలిక తండ్రి సూచించాడు. చివరకి ఆ యువకుడు గ్రామస్థులకు పట్టుబడ్డాడు. దాంతో చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

  • వైద్య పరీక్షలకు బాలిక

అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనలో నిందితులైన పూజారి, బాలిక తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి, దళిత బహుజన సభ్యులు పరామర్శించారు. బాలికను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

ఇదీచూడండి. బస్సు-కారు ఢీ... ఒకరు మృతి

Last Updated : May 18, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.