ETV Bharat / state

గుండ్లకమ్మవాగులో ఓ వ్యక్తి గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు - గుండ్లకమ్మవాగులో ఓ వ్యక్తి గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు

ప్రకాశంజిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట వద్ద గుండ్లకమ్మవాగులో ఓ వ్యక్తి గల్లయ్యాడు. మంగళవారం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు. ఒకరు సురక్షితంగా ఒడ్డుకు రాగా మరొకరు గల్లంతయ్యారు. రెండు రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టిన ఆతని ఆచూకీ తెలియలేదు.

a man missing in Gundlakamma River
గుండ్లకమ్మవాగులో ఓ వ్యక్తి గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు
author img

By

Published : Dec 2, 2020, 10:46 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన షాజహాన్, జానీబాషా పండ్ల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం ద్విచక్రవాహనంపై వ్యాపారం పని మీద ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు. కొచ్చెర్లకోట వద్ద గుండ్లకమ్మవాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు. నీటీ ప్రవాహంలో షాజహాన్ కొట్టుకుపోగా... జానీబాషా సురక్షితంగా బయటపడినట్లు ఎస్సై ఫణిభూషణ్ వివరించారు.

ఎంత వెతికినా నిరాశే...

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మంగళవారం రాత్రివరకు వెతికినా ఆ వ్యక్తి జాడా తెలియలేదు. బుధవారం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టినా నిరాశే మిగిల్చింది. గురువారం కూడా గాలింపు చర్యలు చేపడతాం. -ఫణిభూషణ్, ఎస్సై

ఇదీ చదవండి:

'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.