Doctor Halchal: తాను తెచ్చుకున్న మద్యం తాగేందుకు.. రెస్టారెంట్ వాళ్లు అనుమతి ఇవ్వలేదని ఓ డాక్టర్.. కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. పట్టణ సమీపంలోని ఓ రెస్టారెంట్‌కి.. అనుమలవీడు పీహెచ్సీ ప్రభుత్వ వైద్యుడు భానుకుమార్ రెడ్డి వచ్చాడు.
భోజనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తనతోపాటు తెచ్చుకున్న మందు బయటికి తీశాడు. ఇది చూసిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఇక్కడ మందు తాగడానికి అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు డాక్టర్.. రెస్టారెంట్లో కూరగాయలు కోసేందుకు సిద్ధంగా ఉన్న కత్తి తీసుకుని సిబ్బందిపై దాడికి యత్నించాడు. భానుకుమార్ రెడ్డిని.. రెస్టారెంట్ సిబ్బంది నిలువరించేందుకు ప్రయత్నించగా.. కత్తితో చుట్టుపక్కల అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో.. భానుకుమార్ రెడ్డిపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు