ETV Bharat / state

రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య.. కళాశాల ఎదుట ఎస్​ఎఫ్​ఐ ధర్నా

author img

By

Published : Apr 21, 2021, 3:04 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు చెందిన ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి నిరసనగా ధర్నా చేశారు.

Student commits suicide by falling train in chirala
చీరాలలో రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

ఓ డిప్లమో విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన ఎలిషా.. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మొదటి ఏడాదికి సంబంధించిన సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్న క్రమంలో కాపీ కొడుతూ అబ్జర్వర్​కు పట్టుబడ్డాడు. దీంతో మాల్ ప్రాక్టీసు కింద బుక్ చేసి పరీక్ష హాల్​నుంచి బయటకు పంపారు. దాన్ని అవమానంగా భావించిన ఎలిషా.. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మందలిస్తారనే భయంతో పట్టణంలోని బేర్ ఆసుపత్రి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, ఎస్ఎఫ్ఐ నాయకులు.. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చీరాల పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని పరిస్దితిని చక్కదిద్దారు.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిడ్‌ టీకాలు

కరోనాతో ప్రముఖ రచయిత మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.